నేడు విద్యాత్ సరాఫరాకు అంతరాయం

GNTR: గుంటూరులోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 11 కేవీ విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందన్నారు. గుజ్జనగుండ్ల, ఉద్యోగనగర్, కేవీపీ కాలనీ, శ్రీనివాసరావుతోట, చుట్టుగుంట, ఎం.జి.నగర్ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.