టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

తూ.గో: టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం కుతుకులూరులో శుక్రవారం జరిగిన 'బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.