VIDEO: సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన మంత్రి సవిత
సత్యసాయి: గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారిపల్లిలో రూ. 13.50 లక్షలతో సీసీ రోడ్డుకు మంత్రి సవిత మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో సీసీ రోడ్లు వేయకుండా గాలికి వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తూ.. గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.