ఇండ్లులేని పేదవారినే లబ్ధిదారులగా గుర్తించండి: ఎమ్మెల్యే

NLG: నిష్పక్షపాతంగా అన్ని వర్గాలలో ఇండ్లులేని పేదవారినే లబ్ధిదారులుగా గుర్తించాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. పెద్దవూర మండలం పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపికైన కొత్తలూరులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కట్టే బోయిన లింగయ్య, నాగమ్మ దంపతులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజలో పాల్గొన్నారు.