గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్

గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్

BHNG: రాజాపేట మండలంలోని గ్రామపంచాయతీ వర్కర్లు చలో హైదరాబాద్ నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మొర్రి యాకయ్య మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలన్నారు. ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.