VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

HNK: అయినవోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని ఇన్వార్డ్‌లో ఉన్న పేషెంట్ల వద్దకు వెళ్లి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.