పెనమలూరులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: పెనమలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా దుర్వినియోగం, బాల్యవివాహాలు, గంజాయి సహా మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామ పరిధిలోని యువతీ యువకులకు శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి, దాని వినియోగంపై అవగాహన కల్పించారు.