నాగలదిన్నెలో ఎన్టీఆర్ సుజల స్రవంతి యూనిట్-2 ప్రారంభం

KRNL: నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని టీడీపీ సీనియర్ నాయకులు ఖాసిం వలి పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి సంబంధించిన యూనిట్-2 ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కేవలం రూ.5కే 20 లీటర్ల సురక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు.