రేపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

రేపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

MBNR: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ రేపు హన్వాడ మండలానికి రానున్నట్లు బీజెపీ ఎస్టీ మోర్చానేత సూర్యనాయక్ తెలిపారు. ఉదయం 9గంటలకు మండలంలోని గుడిమల్కాపూర్, లాల్యతండా, రామ్ నాయక్ తండాలలో జరిగే సమావేశాలలో ఆయన పాల్గొని గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమావేశం కానున్నట్లు పెర్కొన్నారు.