'పెన్షన్లు తొలగించడమేనా మంచి ప్రభుత్వం'

ELR: దెందులూరు నియోజకవర్గంలో 842 మంది పెన్షన్లు తొలగించారని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి బుధవారం దుయ్యబట్టారు. పెదవేగిలో 342, పెదపాడు 145, దెందులూరు 260, ఏలూరు రూరల్ 95 మందివి పెన్షన్లు తీసివేశారన్నారు. వీరిలో 10 నుంచి 15 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారే అన్నారు. ఇలా పెన్షన్లు తొలగించడమేనా మంచి ప్రభుత్వం అని ప్రశ్నించారు.