ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన అధికారి
BPT: బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మలేరియా అధికారి నాగార్జున రావు ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మలేరియా నివారణ చర్యలు, మందుల నిల్వలు, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దోమల నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.