రేపే కుప్పంలో ఉబ్బదేవర జాతర
CTR: కుప్పం బైపాస్ రోడ్‌లోని బైరుగానుపల్లి ధోబి ఘాట్ వద్ద నెలకొన్న శ్రీ ప్రసన్న ఉబ్బదేవర అమ్మవారి జాతర రేపు నిర్వహించనున్నట్లు రజిక సంఘం నేతలు తెలిపారు. చిన్న గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, గంగపూజ, ఉబ్బదేవర పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి పొంగళ్లు పెట్టడం జరుగుతుందన్నారు. సాయంత్రం అమ్మవారి జలాధివాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు