విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం ఆదాయాన్ని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు వెల్లడించారు. భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 1,27,384 ఆదాయం లభించిందని, ప్రత్యేక దర్శనం ద్వారా 121 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 14 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 1925 మంది స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.