గద్వాలలో రోడ్డెక్కి రైతుల నిరసన

గద్వాలలో రోడ్డెక్కి రైతుల నిరసన

GDWL: గద్వాలలో యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో, సరఫరా సరిగా లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వేసిన పంటలు దెబ్బతింటున్నాయని, వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.