గ్రామ శివారులో క్షుద్రపూజల కలకలం

గ్రామ శివారులో క్షుద్రపూజల కలకలం

KNR: మానకొండూరు మండలం అన్నారం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. దారి మధ్యలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వంటి పూజా సామాగ్రి చూసి రైతులు భయాందోళనకు గురయ్యారు. ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి మూఢ విశ్వాసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.