తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ: ఎంపీడీవో

తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ: ఎంపీడీవో

NDL: పగిడ్యాల మండలంలోని నెహ్రూ నగర్‌లో శుక్రవారం గ్రీన్ అంబాసిడర్లకు ఎంపీడీవో సుమిత్రమ్మ శిక్షణ ఇచ్చారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని, తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని ఆమె తెలిపారు. ఇళ్లకు వెళ్లి చెత్తను సేకరించి షెడ్డుకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రహీం, సర్పంచ్ శేషమ్మ పాల్గొన్నారు.