ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
AP: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోతిరెడ్డి పాలెం కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పురుషోత్తపురానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై తమ గ్రామం నుంచి పోతిరెడ్డి పాలెం వెళ్తుండగా.. అర్థరాత్రి ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.