'ప్రజలకు తాగునీరు అందించడమే ఎమ్మెల్యే లక్ష్యం'

'ప్రజలకు తాగునీరు అందించడమే ఎమ్మెల్యే లక్ష్యం'

కృష్ణా: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ లక్ష్యమని నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం కోడూరు మండలం వీ కొత్తపాలెంలో నూతన ఏటీఎం తరహా వాటర్ ప్లాంటును వెంకట్రామ్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటి వినియోగం ద్వారా నీటి సంబంధిత వ్యాధుల సంక్రమణ నిరోధించవచ్చన్నారు.