అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి

అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి

ప్రకాశం: కారంచేడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన శనివారం సందర్భంగా.. ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పూజల అనంతరం స్వామి వారు తులసి మాల అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.