VIDEO: స్వల్పంగా పెరిగిన మిర్చి, పత్తి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇవాళ మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,200, నాన్ ఏసీ మిర్చి ధర రూ.19,200, అటు క్వింటా పత్తి ధర రూ.7,600గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.200, నాన్ ఏసీ మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.75 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.