కనకదాసు విగ్రహాన్ని వితరణ చేసిన మంత్రి

కనకదాసు విగ్రహాన్ని వితరణ చేసిన మంత్రి

సత్యసాయి: రామగిరి మండలం తూముచెర్ల గ్రామానికి చెందిన కురుబ కులస్తులు మంత్రి సవితను పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా కనకదాసు విగ్రహాన్ని అందజేయాలని మంత్రిని కోరారు. మంత్రి వెంటనే స్పందించి విగ్రహాన్ని తన తండ్రి కీర్తిశేషులు ఎస్. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.