'విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి'

SRPT: విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుజూర్నగర్ ఎంఈఓ భూక్యా సైదా నాయక్ తెలిపారు. హుజూర్నగర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పెయింటింగ్, కంప్యూటర్ బేసిక్స్‌పై శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈనెల 8 నుంచి 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు.