VIDEO: రహదారుల అభివృద్ధికి రూ. 20.63 కోట్లు మంజూరు
కోనసీమ: పి.గన్నవరం నియోజకవర్గంలో 18 రహదారుల అభివృద్ధికి రూ. 20.63 కోట్ల నిధులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అయినవిల్లి మండలం శానపల్లిలంకలో మాట్లాడుతూ.. NREGS ద్వారా ఈ నిధులు మంజూరు అయ్యాయి అన్నారు. రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.