కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
MHBD: గూడూరు మండలం నేలవంచ మట్వాడ గ్రామానికి చెందిన గుగులోతు అనిత కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి మృతి చెందింది. భర్తతో వ్యవసాయం విషయంలో జరిగిన గొడవతో క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి మంగళవారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.