VIDEO: పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
KNR: రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ అని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.