VIDEO: ఫిషర్ మాన్ సొసైటీ సభ్యులుగా 9 మంది ఎన్నిక

VIDEO: ఫిషర్ మాన్ సొసైటీ సభ్యులుగా 9 మంది ఎన్నిక

కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులో శ్రీ వెంకటేశ్వర సౌండ్ బోట్స్ మాన్ అండ్ ఫిషర్ మాన్ సొసైటీ ఎన్నిక బుధవారం రాత్రి జరిగింది. ఈ ఎన్నికలో సొసైటీ సభ్యులుగా 9 మంది ఎన్నికయ్యారు. 18 మంది పోటీ చేయగా కొప్పడి దుర్గారావు ప్యానల్ సభ్యులు 9 మంది విజయం సాధించారు. దుర్గారావు ప్యానల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన చింతా కనకరాజు వర్గం ఒక్క సభ్యుడిని గెలుచుకోలేకపోయింది.