ఉచిత కంటి శిబిరం ద్వారా కంటి పరీక్షలు
KRNL: పెద్దకడబూరులోని ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. శిబిరాన్ని బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టీడీపీ నాయకుడు బొగ్గుల నరసన్న, కంటి వైద్య నిపుణుడు డా. హేమంత్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.