ఆ వీడియో ఫేక్: పోలీసులు
తమిళనాడు కోయంబత్తూరు జిల్లా అవినాశిలో రోడ్డుపై అంబులెన్స్‌లోంచి స్ట్రెచ్‌తో రోగి పడుతున్నట్లు ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక పోలీసులు స్పందించారు. ఆ వీడియో నిజం కాదని స్పష్టం చేశారు. అలాగే వీడియోలో చెబుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని వెల్లడించారు.