ఇరాన్ దాడులు.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్

ఇరాన్ దాడులు.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో దుబాయ్, మనామా, దోహాలో భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. అనంతరం తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేశాయి. ప్రజలంతా బయటకు రావొద్దని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించాయి.