నేల ఆరోగ్యమే మానవ శ్రేయస్సుకి మూలం: తుమ్మల
TG: నేల ఆరోగ్యమే మానవ శ్రేయస్సుకి మూలమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో రైతులకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు తగ్గించి, పిల్లిపెసర, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులతో నేల సారాన్ని పెంచుకోవాలన్నారు. 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047'ద్వారా సాగు ఖర్చు తగ్గించి, రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.