రూ. 1. 5 లక్షల ఉచిత వైద్యం.. పోస్టర్ ఆవిష్కరణ
కడప: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శనివారం పీఎం రాహత్ పథకం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు 48-72 గంటల అత్యవసర సమయంలో రూ. 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడటమే దీని ప్రధాన లక్ష్యమన్నారు.