హైవే రోడ్ల సమస్యలపై మంత్రికి వినతి
కడప జిల్లాలో హైవే రోడ్లకు సంబంధించిన సమస్యలపై కేంద్ర రోడ్డు, రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీను పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని హైవేలకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.