సురవరం మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

సురవరం మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురవరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే సుధాకర్‌రెడ్డి లేరంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. కాగా, సురవరం సుధాకర్ రెడ్డి నిన్న రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.