మండపేట పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

కోనసీమ: శ్రావణమాసం 5వ శుక్రవారం సందర్భంగా మండపేటలోని ఏడిద రోడ్ లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అమ్మవారికి పలు రకాల వంటలతో పాటు వస్త్రాలు, గాజులతో సారె పెట్టారు. ఆనంతరం భారీ ఆన్నదాన కార్యక్రమం నిర్వహించారు.