బీజేపీ గిరిజన మోర్చా కామేపల్లి మండల అధ్యక్షుడిగా రాజేష్

ఖమ్మం: కామేపల్లి మండలం గోవింద్రాలకి చెందిన బాదావత్ రాజేశ్ బీజేపీ గిరిజన మోర్చా కామేపల్లి మండల అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు జర్పల రామారావు రాజేశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. రాజేశ్‌ను బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకుడు భూక్య శ్రీను నాయక్, పోలూరి రామచంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి జర్పల కృష్ణ, ధరావత్ బాలకృష్ణ అభినందించారు.