'ఏలూరులో హాల్ట్ ఏర్పాటు చేయాలి'
ELR: కాకినాడ - భావ్‌నగర్ ట్రైన్‌కి ఏలూరు స్టేషన్‌లో హాల్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లేఖ రాశారు. ఏలూరు నుంచి సూరత్, షోలాపూర్‌లకు ఎక్కువగా ప్రయాణించే వ్యాపార వర్గాలతో పాటు, అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలకు ఉన్నత చదువుల కోసం ప్రయాణిస్తుంటారన్నారు.