పెద్దకడుబూరులో వివాహిత మృతదేహం లభ్యం
KRNL: కామవరం గ్రామానికి చెందిన వివాహిత కోటేశ్వరి(21) మృతదేహం ఈరోజు LLC కాలువలో లభ్యమైంది. వరకట్నం కోసం 10 రోజుల నుంచి వేధిస్తూ తమ కూతురిని భర్త వీరేశ్, కుటుంబసభ్యులు హత్య చేసి కాలువలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత పెద్దకడుబూరు శివారులో మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.