పవన్ బాటలోనే విజయ్

2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమరానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ శంఖం పూరించారు. ఐ యామ్ కమింగ్ పేరిట భారీ ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ వరకు ప్రతి శని, ఆదివారాల్లో జనంలోకి రానునట్లు వెల్లడించారు. ఇప్పటికే విజయ్ ప్రచారం కోసం ప్రత్యేకంగా బస్సును కూడా సిద్ధం చేశారు. ఈ వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్ వారాహి వాహనం స్టేల్లోనే రూపొందించటం విశేషం.