ప్రయాణికులకు అలర్ట్.. ఆరు రైళ్లు రద్దు

ప్రయాణికులకు అలర్ట్.. ఆరు రైళ్లు రద్దు

NTR: ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా శనివారం నుంచి మే 5 వరకు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణించే ఆరు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. నం.67213/67214 విజయవాడ-తెనాలి, నం.67263/67264 విజయవాడ-మచిలీపట్నం, నం.67273/67274 విజయవాడ-ఒంగోలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.