అమరాపురంలో ఎస్సీ కాలనీ వాసుల అవస్థలు

SS: అమరాపురం (M) హనుమంతనపల్లి ఎస్సీ కాలనీలో కొన్ని నెలలుగా డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ కాలనీవాసులు వాపోతున్నారు. ఆ కాలనీలో తమ తమ ఇళ్ల ముందు పోసిన నీళ్లు, వర్షపు నీళ్లు ఏకమై రహదారిపై నిలిచి దుర్గంధమైన వాసన వస్తోందన్నారు. ఆ కాలనీలో పిల్లలకు, ముసలి వారికి వ్యాధులు సోకి ఆసుపత్రి పాలవుతున్నామన్నారు.