'కొత్త డ్రామాలకు తెరలేపిన కాంగ్రెస్ నాయకులు'

MHBD: ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు కొత్త డ్రామాలకు తెర లేపారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కురవి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన పిదపే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.