కుప్పకూలిన షాప్ ముందు భాగం.. తప్పిన ప్రమాదం

కుప్పకూలిన షాప్ ముందు భాగం.. తప్పిన ప్రమాదం

KMM: వర్షానికి శిథిలావస్థలో ఉన్న షాప్ ముందు భాగం కుప్పకూలింది. అయితే, ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నేలకొండపల్లికి చెందిన శ్రీనివాసరావు అద్దె ఇంట్లో కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి గోడలు ఇటీవల వర్షాలకు నానడంతో షాప్ తీస్తుండగా ఇంటి ముందు భాగం కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.