మరోసారి కిలోవేయ అగ్నిపర్వతం విస్ఫోటనం

మరోసారి కిలోవేయ అగ్నిపర్వతం విస్ఫోటనం

అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలోని కిలోవేయ అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి లావా 100 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 2024 DEC నుంచి ఇప్పటివరకు కిలోవేయ 38సార్లు విస్ఫోటనం చెందింది.