అంబారిపేటలో గుండెపోటుతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అంబారిపేట గ్రామంలో ఎర్ర చిన్న బుచ్చయ్య ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఆ గ్రామానికి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఊహించని రీతిలో అతనికి చెస్ట్ పెయిన్ రావడం జరిగిందని స్థానికులు తెలిపారు.