VIDEO: 'విద్యార్థుల భద్రత లక్ష్యంగా వాహనాలు తనిఖీలు'
KKD: విద్యార్థుల భద్రత లక్ష్యంగా విద్యార్థులను పాఠశాలలకు తరలించే వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు సీఐ ఏ కృష్ణ భగవాన్ అన్నారు. సామర్లకోట పట్టణంలోని ప్రత్తిపాడు సెంటర్లో స్కూలు ఆటోలు, వ్యాన్‌లు, ఇతర వాహనాలను శుక్రవారం సాయంత్రం శ్రీ కృష్ణ భగవాన్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. అధిక మంది విద్యార్థులతో వెళుతున్న ఆటోలను ఆపి ఆయన తనిఖీలు చేపట్టారు.