అమెరికాను ఢీకొట్టే ఆయుధాలు ఉన్నాయి: ట్రంప్

అమెరికాను ఢీకొట్టే ఆయుధాలు ఉన్నాయి: ట్రంప్

అణ్వాయుధాలు, క్షిపణులను ఇరాన్ వేగంగా తయారు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికాను, తమ దేశ స్థావరాలను ఢీకొట్టగలిగే క్షిపణులు టెహ్రాన్ వద్ద ఉన్నాయని చెప్పారు. అగ్రరాజ్యాన్ని చేరుకోగలిగే క్షిపణులను కూడా తయారు చేస్తోందన్నారు. అణ్వాయుధాల అభివృద్ధికి కవచంగా మిసైళ్లను వాడుకుంటుందని ఆరోపించారు. అణ్వాయుధాలు మధ్యప్రాచ్యం, అమెరికాకు పెను ముప్పని తెలిపారు.