VIDEO: మాటూరుపేటలో పొంగిన వాగు.. రాకపోకలు బంద్

KMM: మధిర మండలం మాటూరుపేట గ్రామంలో శనివారం కురిసిన వర్షానికి గ్రామ సమీపంలోని వాగు పొంగి పొర్లుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పొంగి పొర్లుతున్న వాగుతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.