ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

NLG: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోనీ పలు వార్డులను, రిజిస్టర్లను నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి పనులు పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.