చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ATP: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా పాదచారులు, ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.