వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRCL: నిరుపేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం పెద్ద లింగాపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.